కోటబొమ్మాలి మండలం చిన్న బమ్మిడి పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు పాల్గొన్నారు. శనివారం ఉదయం గ్రామానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ ఏడాది పాలనలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఈ క్రమంలో ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తదితరులు పాల్గొన్నారు.