రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు బుధవారం కోటబొమ్మాలి మండలంలోని హడ్కో కాలనీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి ఎన్టీఆర్ భరోసా భద్రతా పెన్షన్లను పంపిణీ చేశారు. నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని, ఒకటో తేదీనే పింఛన్లు లబ్ధిదారులకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఆ విధంగానే నేడు కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు.