శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదులు ఉగ్రరూపం దాల్చి జిల్లా యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాయి. ఒడిశా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాల కారణంగా ఈ నదుల్లోకి వరద నీరు చేరింది. ప్రస్తుతం క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నదుల్లోకి వరద నీరు రావడం ఆగింది. దీంతో రెండు నదులు సాధారణ స్థితికి చేరాయి. వరద ముప్పు తప్పడంతో ప్రజలు, జిల్లా యంత్రాంగం ఊపిరి తీసుకున్నారు.