నాగావళి నది ఉగ్రరూపం: శ్రీకాకుళం అప్రమత్తం

0చూసినవారు
ఒడిస్సాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి నదిలోకి వరద నీరు చేరి ఉధృతి పెరిగింది. దీంతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నాగావళి నది పరీవాహక ప్రాంతాల ప్రజలను హెచ్చరించారు. శ్రీకాకుళం నగరాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న నాగావళి నది వరద పరవళ్లతో ఉగ్రరూపం దాల్చింది. అయితే, పరిస్థితి అదుపులోనే ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సైక్లోన్ సెల్ వర్గాలు తెలిపాయి. జిల్లాలోని వంశధార, బాహుదా నదులలోకి కూడా వరద నీరు వస్తోంది. హిరమండలంలోని గొట్ట బ్యారేజీలో వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం ఉదయం 8 గంటలకు 35,938 క్యూసెక్కుల నీరు చేరిందని వంశధార ప్రాజెక్ట్ డీ.ఈ. సరస్వతి తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం, కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేసి, నదిలోకి నేరుగా నీటిని విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you