నందిగాం: షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న సోనీ తేజ

906చూసినవారు
నందిగాం: షైనింగ్ స్టార్ అవార్డును అందుకున్న సోనీ తేజ
నందిగాం మండలం సింగుపురం గ్రామానికి చెందిన మట్ట సోనీ తేజ, వమరవిల్లి బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతిలో 589 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా ఆమె షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికైంది. సోమవారం రాత్రి తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా తేజ ఈ అవార్డును అందుకుంది. ఈ విజయంపై తేజ తల్లిదండ్రులు ఈశ్వరరావు, నిర్మల తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్