నందిగాం: ఈ పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి.. జెడి

2చూసినవారు
నందిగాం: ఈ పంట నమోదు ప్రక్రియ వేగవంతం చేయండి.. జెడి
వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు రైతులు తప్పనిసరిగా పంట నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని వ్యవసాయ శాఖ జెడి త్రినాధ స్వామి తెలిపారు. గురువారం నందిగామ మండలం పెంటూరు, నర్సిపురం గ్రామాలలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఎరువుల వాడకం తగ్గించి, యాజమాన్య పద్ధతులు అవలంబించాలని, చీడపీడల నివారణకు చర్యలు తీసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి శ్రీకాంత్ వర్మ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :