నరసన్నపేట: సత్యవరం పాఠశాలలో 20 మంది విద్యార్థులు చేరిక

720చూసినవారు
నరసన్నపేట: సత్యవరం పాఠశాలలో 20 మంది విద్యార్థులు చేరిక
నరసన్నపేట మండలం సత్యవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మొత్తం 20 మంది విద్యార్థులు చేరారని హెచ్ఎం నడిమింటి అప్పలనాయుడు తెలిపారు. గురువారం గ్రామంలో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా అంగన్వాడి కేంద్రాల నుండి ఆరుగురు, నూతనంగా నలుగురు విద్యార్థులు ఒకటో తరగతిలో చేరారు. రెండవ తరగతిలో ప్రైవేట్ పాఠశాలల నుండి నలుగురు, మూడో తరగతిలో ఒక విద్యార్థి అడ్మిషన్ పొందారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్