లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెకు పిలుపు

1చూసినవారు
కార్మికులను బానిసలుగా మార్చే నాలుగు లేబర్ కోడ్లను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం 2025 నవంబర్ 21 నుండి అమలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ, ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి. శ్రీకాకుళంలో ఈ సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ ఒక పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి. తేజేశ్వరరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్ కే నాగమణి, ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం ఆదినారాయణ మూర్తి, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు డి.రమణారావు, ఉద్యోగ సంఘ నాయకులు శ్రీనివాస్ యాదవ్, సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :