సంతబొమ్మాళి మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థినిని అదే గ్రామానికి చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసగించి గర్భవతిని చేశాడని నౌపడా ఎస్సై జి. నారాయణస్వామి శుక్రవారం తెలిపారు. బాధిత విద్యార్థిని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.