సంతబొమ్మాలి మండలం మూలపేట పంచాయితీ పోతి నాయుడుపేట వద్ద పులి సంచారం జరుగుతున్నట్లుగా గుర్తించడం జరిగిందని టెక్కలి ఫారెస్ట్ రేంజర్ జి జగదీశ్వరరావు స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున గ్రామంలో ఒక ఆవుపై దాడి చేయడంతో అది మృతి చెందిందని తెలియజేశారు. దీని పట్ల స్థానిక గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని గురువారం సాయంత్రం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. రాత్రి వేళలో ఎవరు బయటకు రావద్దు అంటూ సూచించారు.