మాజీ మంత్రి అప్పలరాజు సోమవారం సంతబొమ్మాలి మండలం నౌపాడలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీదేనని తెలిపారు. జగన్ స్ఫూర్తితోనే మూలపేట పోర్టు ఆవిష్కరించడం జరిగిందని, భోగాపురం ఎయిర్పోర్ట్ కు కూడా ఆయనే శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. రాజన్న హయాంలోనే రిమ్స్ కాలేజీ వచ్చిందని, అసెంబ్లీలో జగన్ పై వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.