సంతబొమ్మాళి (మ)మూలపేట గ్రామానికి చెందిన రాజు ఆదివారం కోటబొమ్మాళి వెళ్తుండగా, బైక్ అదుపుతప్పి రోడ్డుపై పడి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. ఇటీవలే వివాహం చేసుకున్న రాజు, పెళ్లైన 21 రోజులకే ఇలా జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాలం గడవకముందే వధువుకు ఈ కష్టం రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.