శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు నిధులు మంజూరు చేసి ప్రారంభించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. సోమవారం సంతబొమ్మాలి మండలం నౌపడలో జరిగిన వైసిపి బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ, దేశ పటంలో మూలపేటను చేర్చిన ఘనత జగన్‌కే దక్కుతుందని, జిల్లాలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు పోర్టు అభివృద్ధిపై దృష్టి సారించలేదని ఆరోపించారు.