సంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా వ్యాధి ప్రబలి ఒకరు మృతి చెందారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జిల్లా వైద్యాధికారిని అనితతో కలిసి మంగళవారం బాధితులను పరామర్శించారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, వ్యాధి పూర్తిగా నయం అయ్యేవరకు బాధ్యత ప్రభుత్వానిదేనని మంత్రి హామీ ఇచ్చారు.