సంతబొమ్మాళి మండల కేంద్రంలో శ్రీ సూర్య మారుతి సేవాసంఘం ఆధ్వర్యంలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయ శిఖరం ధ్యాన ప్రతిష్ట కార్యక్రమం బుధవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ పెద్దలు, గ్రామపెద్దలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ శిఖర ప్రతిష్టకు సుమారు 60 లక్షల రూపాయలు దాతల విరాళాలతో నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.