మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ ప్రభుత్వం 25 ఏళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లాకు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. సోమవారం నౌపడలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, రాజన్న, జగన్ హయాంలో కేవలం ఐదేళ్ల పాలనలోనే జిల్లాలో ఎంతో అభివృద్ధి సాధించారని పేర్కొన్నారు. కూటమి నాయకులు జిల్లాకు ఏం చేస్తున్నారని ఆయన నిలదీశారు.