సోంపేట మండలం బేసి రామచంద్రపురంలో శనివారం ఘోర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కీల్ల సీతారాం తన ఇంటి ముందు చెత్త వేశాడనే నెపంతో పొందర మోహనరావు అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. గమనించిన స్థానికులు మంటలను ఆర్పి బాధితుడిని చికిత్స నిమిత్తం బారువ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసు కేసు నమోదైంది.