శ్రీకాకుళం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణ అత్యంత దారుణంగా తయారైంది. ప్రధాన కూడళ్ళతో పాటు, నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతున్నాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్, ఓబీఎస్ మార్కెట్ సమీపంలో ఉన్న చెత్త కుండీల నిర్వహణను గాలికి వదిలేశారనే విమర్శలున్నాయి. చెత్త కుండీలలోని చెత్తను పశువులు బయటకు లాగి చెల్లాచెదురు చేస్తున్నా పట్టించుకునేవారు లేరు. పట్టణ పారిశుధ్య నిర్వహణపై సంబంధిత యంత్రాంగం దృష్టి సారించి, జవాబుదారీగా పనిచేయాలని నగర ప్రజలు కోరుతున్నారు.