ఈరోజు బ్రేకింగ్ న్యూస్ ని మీరు కింద చూడవచ్చు


ఇరాన్ ప్రతిపాదనలు చాట్‌జీపీటీయే రాసింది: జేడీ వాన్స్
Apr 09, 2026, 04:04 IST/

ఇరాన్ ప్రతిపాదనలు చాట్‌జీపీటీయే రాసింది: జేడీ వాన్స్

Apr 09, 2026, 04:04 IST
అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ప్రతిపాదనల ముసాయిదాపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ పంపిన మూడు వేర్వేరు ప్రతిపాదనల్లో ఒకటి ఏఐ సాఫ్ట్‌వేర్ చాట్‌జీపీటీ ద్వారా రూపొందించినట్లుగా ఉందని ఆయన వెల్లడించారు. మొదటి ప్రతిపాదనలు చాట్‌జీపీటీ సృష్టించినట్లుగా ఉన్నాయని, రెండవది ట్రంప్ పరిగణనలోకి తీసుకున్నారని, మూడవది దారుణంగా ఉందని తెలిపారు. శుక్రవారం ఇస్లామాబాద్‌లో జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం, ఇరాన్ స్పీకర్ మొహమ్మద్ బాఘర్ గాలిబాఫ్ నాయకత్వంలోని బృందం మధ్య తొలి దశ చర్చలు ప్రారంభం కానున్నాయి.