టెక్కలి: డివైడర్‌పై వృద్ధుడి మృతదేహం

3చూసినవారు
టెక్కలి: డివైడర్‌పై వృద్ధుడి మృతదేహం
శుక్రవారం టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న రహదారి డివైడర్‌పై ఒక వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతుడు కంట్రగడ గ్రామానికి చెందిన వీ.ఆనంద్ (71) అని, ఆయన కొన్నేళ్లుగా టెక్కలిలో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నారని తెలిసింది. అనారోగ్య సమస్యతో మృతిచెంది ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు సమాచారం అందుకున్నారు.

సంబంధిత పోస్ట్