టెక్కలి మండలం నర్సింగపల్లి గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసి నలుగురిని గాయపరిచింది. మధ్యాహ్నానికి గాయపడిన వారి సంఖ్య 9కి చేరింది. గాయపడిన మరో ఐదుగురు టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే రోజు తొమ్మిది మంది కుక్కకాటుకు గురికావడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు.