ఆదివారం టెక్కలి మండలం పోలవరం బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు శక్తి యాప్ పై అవగాహన కల్పించారు. ఈ యాప్ వలన తక్షణ రక్షణ లభిస్తుందని, దీనిని ఎలా వినియోగించాలో వారికి తెలియజేశారు. శక్తి యాప్ పట్ల అవగాహన పరుచుకున్న
విద్యార్థులు వారి వారి తల్లిదండ్రులకు ఈ యాప్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేయాలని శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్, కానిస్టేబుల్స్ భీమారావు, విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.