సరదాగా కూడా ఎటువంటి పరిస్థితుల్లో
విద్యార్థులు మాదకద్రవ్యాల జోలికి పోవద్దని శక్తి టీం హెచ్ సి ఎం గిరిధర్ రావు, కానిస్టేబుల్స్ భీమారావు, విజయలక్ష్మి తెలిపారు. మంగళవారం టెక్కలి మండలం తలగాం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఏ చెడు వ్యసనం అయిన సరదాగా మొదలవుతుందని తర్వాత వాటికి బలి కావడం తప్పదని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.