టెక్కలి: ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేత

2చూసినవారు
టెక్కలి: ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేత
టెక్కలి-భగవాన్ పురం మార్గంలో రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో, టెక్కలి రైలు నిలయం రోడ్డు నుంచి ఎన్టీఆర్ నగర్ వరకు గురువారం నుంచి పదిరోజుల పాటు రాకపోకలు నిలిపేస్తున్నట్లు పంచాయతీ రాజ్ ఏఈ ఎస్ లక్ష్ముంనాయుడు తెలిపారు. రోడ్ విస్తరణ, ఇరువైపులా కాలువల నిర్మాణం పనులకు ఆటంకం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.