టెక్కలి ఆధి ఆంధ్రావీధికి చెందిన జోగి మల్లేసు బ్రెయిన్ స్ట్రోక్‌తో శ్రీకాకుళంలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. మల్లేసు, సీతమ్మ దంపతులు స్థానికంగా తాళ్లు, కట్టెలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా కుమారుడు గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. ఈ నేపథ్యంలో భార్య సీతమ్మ తన భర్త చితికి తలకొరివి పెట్టడం స్థానికులను కంటతడి పెట్టించింది.