ధనుష్‌ 55వ చిత్రంలో శ్రీలీల, మమ్ముట్టి!

3475చూసినవారు
ధనుష్‌ 55వ చిత్రంలో శ్రీలీల, మమ్ముట్టి!
నటుడు ధనుష్‌ తన 55వ సినిమా వివరాలను పంచుకున్నారు. 'అమరన్‌' దర్శకుడు రాజ్‌కుమార్‌ పెరియసామితో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శ్రీలీల ఎంట్రీ ఇచ్చారు. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి కూడా కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. యువ సంగీత దర్శకుడు సాయిఅభయంకర్‌ సంగీతం అందిస్తున్నారు. వేల్స్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌ ముగింపులో విడుదల కానుంది. శ్రీలీల ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.

సంబంధిత పోస్ట్