రేపు 'శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం': భూమన

48చూసినవారు
రేపు 'శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం': భూమన
AP: తిరుమల లడ్డూపై కూటమి ప్రభుత్వం చేసిన ఆరోపణలతో కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. నెయ్యిలో జంతువుల కొవ్వు లేదని సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొనడంతో హోమం చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. రేపు ఉదయం 10 గంటలకు తిరుపతిలో 'శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం' చేపడతామని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్వామివారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్