AP: శ్రీవారి సేవను మరింత బలోపేతం చేసేందుకు, దేవస్థానంలోని అన్ని వైద్యశాలల్లో శ్రీవారి వైద్యసేవను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులు ఆదేశించారు. ప్రస్తుతం శ్రీవారి సేవలకు అవకాశం కల్పించాలని, అవసరమైతే శిక్షణ అనంతరం వారి సేవలు వినియోగించుకునేలా చూడాలన్నారు. ఇందుకు అవసరమైన ప్రత్యేక సెల్, విధివిధానాలు రూపొందించాలన్నారు.