అన్ని రాష్ట్రాల సీఎంలకు టీటీడీ లేఖలు

1516చూసినవారు
అన్ని రాష్ట్రాల సీఎంలకు టీటీడీ లేఖలు
AP: దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు, టీటీడీ పాలక మండలి ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. తమిళనాడులోని కోయంబత్తూరులో 19.62 ఎకరాల భూమిని ఒక రియల్టర్ సంస్థ విరాళంగా ఇచ్చింది. అస్సాంలోని కామరూప్ జిల్లాలో 10.32 ఎకరాలను ప్రభుత్వం విక్రయించింది. నవీ ముంబయిలోని ఉల్వేలో రేమండ్ గ్రూప్ చైర్మన్ గౌతమ్ సింఘానియా రూ.100 కోట్ల విరాళంతో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కర్ణాటకలోని బెలగావిలో 7 ఎకరాల భూమిని కేటాయించారు. అన్ని రాష్ట్రాల సీఎంలకు స్థలాల కేటాయింపు కోసం టీటీడీ లేఖలు రాసింది. బీహార్ ప్రభుత్వం పాట్నా జిల్లాలో 99 ఏళ్ల లీజుతో 10.11 ఎకరాల భూమిని నామమాత్రపు రుసుముతో ఇవ్వడానికి అంగీకరించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్