AP: వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌కు మరో షాక్ తగలనుంది. ఆయన కుమారుడు రాజీవ్‌పై కేసు నమోదు చేయడానికి పోలీసులు సిద్ధమైనట్లు తెలిసింది. నిన్న ప్రభుత్వ ఆస్పత్రిలో జోగి రమేశ్‌ను హాజరుపరిచే సమయంలో రాజీవ్ వైసీపీ అనుచరులతో కలిసి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో వారితో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ తోపులాట జరిగింది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.