తమిళనాడు మాజీ సీఎం, డీఎంకే చీఫ్ ఎం.కె. స్టాలిన్ అల్లుడు శబరీసన్.. తనపై నిరాధారమైన, పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ ఇద్దరు టీవీకే మంత్రులకు నోటీసులు పంపారు. 15 రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. టీవీకే ప్రభుత్వ మంత్రి ఆదవ్ అర్జున ఇటీవల స్టాలిన్ కుటుంబంపై ఆరోపణలు చేస్తూ, గత ప్రభుత్వంలో డీఎంకే మంత్రులు అవినీతి ద్వారా డబ్బు వసూలు చేశారని, ఆ డబ్బును స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్, అల్లుడు శబరీసన్‌కు పంచారని విమర్శించారు.