తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత

9చూసినవారు
తొక్కిసలాట ఘటన.. మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆలయంలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.15 లక్షల చొప్పున పరిహారం అందజేసింది. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఈ పరిహారాన్ని బాధితుల కుటుంబాలకు అందించారు. ఈ ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్