పెళ్లి కాలేదని చెప్పి గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో!

11132చూసినవారు
పెళ్లి కాలేదని చెప్పి గోవాలో ల్యాండ్ కొన్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆయన భార్య ఆర్తీల విడాకుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, జయం రవి తన సన్నిహితురాలు, సింగర్ కెనిషా ఫ్రాన్సిస్‌తో కలిసి గోవాలో రూ. 42 లక్షల విలువైన భూమిని కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ భూమి రిజిస్ట్రేషన్ పత్రాల్లో జయం రవి తన వైవాహిక స్థితిని ‘అన్-మ్యారీడ్’ అని పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్తీతో ఇంకా చట్టబద్ధంగా విడాకులు రాకముందే, కోర్టులో కేసు నడుస్తుండగానే రవి ఇలా పేర్కొనడంపై నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ విషయంపై జయం రవి నుండి ఎలాంటి వివరణ వస్తుందో వేచి చూడాల్సిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్