ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్!

105చూసినవారు
ఫిబ్రవరి 14న రాష్ట్ర బడ్జెట్!
AP: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. 11న ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశమై పని దినాలు, అజెండాను ఖరారు చేస్తుంది. ఫిబ్రవరి 14న సభలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3న ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు క్యాబినెట్ సమావేశం జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్