AP: కూటమి ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ (APIIC) బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలు జిల్లాల నుంచి 15 మంది సభ్యులను బోర్డు డైరెక్టర్లుగా నియమించారు. వీరంతా రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. తదుపరి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఏపీఐఐసీ ఎండీకి ఆదేశాలు జారీ చేసింది.