ప్రస్తుతం అమెరికా వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న స్టెమ్‌సెల్ థెరపీ, భారత్‌లో ఇంకా ప్రయోగ దశలోనే ఉందని నిమ్స్ సంచాలకుడు డా.నగరి బీరప్ప తెలిపారు. నిమ్స్‌లో ఈ చికిత్సను అందుబాటులోకి తీసుకురావడానికి అమెరికాకు చెందిన తులసి థెరపెటిక్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వివరించారు. తులసి థెరపెటిక్స్ ఇప్పటికే స్టెమ్‌సెల్ థెరపీపై అనేక ప్రయోగాలు, అధ్యయనాలు పూర్తి చేసి, అమెరికాలో ఈ చికిత్సను అందుబాటులోకి తెచ్చింది.