AP: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వీధి కుక్కల నియంత్రణకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రియల్ టైమ్‌లో పరిశీలనకు ప్రత్యేక డ్యాష్‌బోర్డు ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 3.50 లక్షలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. వీటి నుంచి చిన్న పిల్లలను కాపాడేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.