AP: ఆర్డీటీ (రూరల్ డెవలాప్‌మెంట్ ట్రస్ట్) ఒక స్వచ్ఛంద సంస్థ కాదని, పేదల బతుకుల్లో వెలుగు నింపిన ఆశా కిరణం అని మంత్రి లోకేశ్ అన్నారు. ఆర్డీటీ సంస్థకు తాత్కాలికంగా ఇబ్బందులు వచ్చాయని, వాటిని శాశ్వతంగా పరిష్కరిస్తామన్నారు. ఆర్డీటీ సేవలు నిరంతరాయంగా ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేశ్ తెలిపారు. ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే సంప్రదించామన్నారు.