విశాఖ ఉక్కును లాభాల బాటలో నడిపేలా చర్యలు: చంద్రబాబు

13చూసినవారు
AP: విశాఖ ఉక్కును కాపాడేందుకు కేంద్ర సహకారంతో రూ.11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీ సాధించి, లాభాల బాటలో నడిపే చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్, రాయలసీమలో జేఎస్‌డబ్ల్యూ గ్రీన్ స్టీల్ ప్రాజెక్ట్ రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కొత్త దిశ చూపనున్నాయని అన్నారు. దేశంలోనే తొలిసారిగా గ్రీన్ ఎనర్జీతో స్టీల్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు రాయలసీమకు రావడం గర్వకారణమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్