AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కుంకుమ పువ్వు సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో 30 ఎకరాల్లో కుంకుమ పువ్వు సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గతంలో చేసిన ప్రయోగాలు విజయవంతం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. లంగసింగి ప్రాంతంలో అనువైన భూమి లభించకపోవడంతో చింతపల్లిని ఎంపిక చేశారు. అనుమతులు లభించిన వెంటనే భూమిని కేటాయించి సాగును ప్రారంభిస్తారు.