వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించిన స్టెయిన్‌

4227చూసినవారు
వైభవ్‌ సూర్యవంశీపై ప్రశంసలు కురిపించిన స్టెయిన్‌
భారత యువ క్రికెటర్ వైభవ్‌ సూర్యవంశీపై సౌతాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ పదిహేనేళ్ల ఆటగాడు సచిన్, కోహ్లిలను మించిపోగలడని, భారత క్రికెట్‌కు దొరికిన అత్యంత విలువైన నిధి అని అభివర్ణించారు. వైభవ్‌ అండర్-19 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో పాటు ఐపీఎల్-2026లో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు అతడిని ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు, ఆసియా క్రీడలకు ఎంపిక చేశారు. అయితే, వైభవ్‌పై ఒత్తిడి పడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోవాలని స్టెయిన్ సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్