వైసీపీ హయాంలో 3 సార్లు స్టైఫండ్ పెరిగింది: కొండా రాజీవ్ గాంధీ

15చూసినవారు
AP: వైసీపీ అధినేత జగన్ హయాంలో జూనియర్ డాక్టర్లకు 3 సార్లు స్టైఫండ్ పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ అన్నారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘జగన్ హయాంలోనే అత్యధికంగా 17 శాతం స్టైఫండ్ పెరిగిందని జూనియర్ డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు గుర్తుకు రాలేదా? చంద్రబాబు, పవన్, లోకేశ్‌లకు స్పెషల్ ఫ్లైట్లలో తిరగడానికి డబ్బులు ఉంటాయి. కానీ, జూనియర్ డాక్టర్లు హక్కుగా రావాల్సింది అడిగితే మాత్రం మీకు ఎక్కడ లేని ఇబ్బంది వస్తుందా?’ అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్