స్టాక్ మార్కెట్ మోసం.. మహిళకు రూ. 47 లక్షల టోకరా

2011చూసినవారు
స్టాక్ మార్కెట్ మోసం.. మహిళకు రూ. 47 లక్షల టోకరా
హైదరాబాద్‌లో స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక ప్రైవేట్ కంపెనీ ఉద్యోగినిని మోసం చేసి రూ. 47.22 లక్షలు అపహరించారు. 'జైనమ్‌ మార్కెట్‌ సర్కిల్‌ కె117' అనే వాట్సాప్ గ్రూప్‌లో చేర్చిన బాధితురాలిని, గ్రూప్ అడ్మిన్ మినల్ పారిక్, 'జైనవీని' అనే అప్లికేషన్ ద్వారా పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మించాడు. మొదట్లో కొంత లాభాలు చూపించి, ఆ తర్వాత మరిన్ని డబ్బులు డిపాజిట్ చేయించి మోసగించాడు. మోసాన్ని గుర్తించిన బాధితురాలు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్