లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

4358చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ బుధవారం సూచీలు రాణించాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి మిశ్రమ సంకేతాలు, క్రూడాయిల్‌ ధరలు తగ్గుముఖం పట్టడంతో మన మార్కెట్‌లో కొనుగోళ్ల మద్దతు కనిపించింది. స్టాక్‌ మార్కెట్‌లో రెండు రోజుల నష్టాలకు బ్రేక్‌ పడింది. సెన్సెక్స్‌ 443 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 162 పాయింట్ల పైకి చేరింది. సెన్సెక్స్‌ 76,922.64 వద్ద, నిఫ్టీ 24,005.85 వద్ద ముగిశాయి. డాలరుతో పోలిస్తే రూపాయి విలువ 95.23గా ఉంది.

సంబంధిత పోస్ట్