వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‍పై రాళ్ల దాడి.. ఇద్దరు మహిళలు అరెస్ట్

7719చూసినవారు
వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‍పై రాళ్ల దాడి.. ఇద్దరు మహిళలు అరెస్ట్
సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలుపై తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో 30 మంది దుండగుల ముఠా రాళ్లతో దాడి చేసింది. గస్తీ పోలీసులు అప్రమత్తమై వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా, దుండగులు పోలీసులపైనే ఎదురుదాడికి దిగారు. అదనపు బలగాల సహాయంతో పోలీసులు వారిని వెంబడించినా, 30 మంది తప్పించుకున్నారు. అయితే, ఈ ముఠాలోని ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఒడిశా, బిహార్, రాజస్థాన్‌కు చెందిన ముఠాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దాడి వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్