లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే విషప్రచారాన్ని ఆపండి: రోజా

23చూసినవారు
లడ్డూలో కల్తీ నెయ్యి కలిపారనే విషప్రచారాన్ని ఆపండి: రోజా
AP: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యి కల్తీపై వస్తున్న ప్రచారాన్ని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం భక్తుల నమ్మకాలతో ఆడుకోవద్దని కూటమి నేతలకు సూచించారు. బ్రహ్మోత్సవాల సమయంలో జగన్ హయాంలో కల్తీ జరిగిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. నాణ్యతా ప్రమాణాలకు విరుద్ధంగా ఉన్న నెయ్యి ట్యాంకర్లను టీటీడీ బోర్డు తిరస్కరించినప్పుడు, ఆ నెయ్యి ప్రసాదాల్లో కలవలేదని స్పష్టమవుతున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు జంతువుల కొవ్వు కలిసిందంటూ అసత్య ప్రచారం చేయడం భక్తుల మనోభావాలను గాయపరచడమేనని రోజా విమర్శించారు.

సంబంధిత పోస్ట్