టూత్ బ్రష్‌ను ఇలా ఉంచితే.. నోటి ఆరోగ్యానికి ప్రమాదం!

1699చూసినవారు
టూత్ బ్రష్‌ను ఇలా ఉంచితే.. నోటి ఆరోగ్యానికి ప్రమాదం!
ఉదయం, రాత్రి తప్పనిసరిగా వాడే టూత్ బ్రష్‌ను పరిశుభ్రంగా ఉంచడం నోటి ఆరోగ్యానికి చాలా ముఖ్యం. అయితే చాలామంది టూత్ బ్రష్‌ను బాత్ రూంలోనే వాష్ బేసిన్ పక్కన పెడుతుంటారు. ఇది మంచి పద్దది కాదు. బ్రష్‌ను ఉపయోగించిన తర్వాత శుభ్రమైన నీటితో కడిగి, నీరు పూర్తిగా కారిపోయేలా నిలువుగా ఉంచాలి. తడిగా మూసివేసిన డబ్బాలో పెట్టడం కూడా మంచిది కాదు. బ్రష్‌లను గాలి బాగా వచ్చే ప్రదేశంలో ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒకే హోల్డర్ లో బ్రష్‌లు ఒకదానికొకటి తగలకుండా కొంత దూరం ఉండేలా అమర్చాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్