AP: మొంథా తుపాను ప్రభావంతో ఏపీలోని అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయాయి. రాబోయే 8–10 గంటలపాటు భారీ వర్షాలు, గంటకు 110 కిమీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. అంతర్వేది వద్ద అలలు ఉధృతంగా ఎగిసిపడుతూ లైట్‌హౌస్ కట్టడాలను తాకుతున్నాయి. కోస్తాంధ్ర, రాజోలు నియోజకవర్గం చీకటిలో మునిగిపోగా, పలు సెల్ టవర్స్ దెబ్బతిన్నాయి. గుడివాడలో ప్రధాన రహదారులపై చెట్లు కూలిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది.