AP: మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా విద్యుత్ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో విద్యుత్ ఉద్యోగులందరి సెలవులు రద్దు చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి ప్రకటించారు. తుఫాను సమయంలో ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరణ చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే పవర్ సప్లై సమస్యల కోసం ప్రజలు 1912 నంబరుకు కాల్ చేయాలని, కిందపడిన విద్యుత్ స్తంభాలు, వైర్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు.