ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన, ఆధ్యాత్మిక ఆచారమైన టిబెటన్ స్కై బరియల్ (ఆకాశ ఖననం) కొనసాగిస్తున్నారు. మరణించిన వ్యక్తి శరీరాన్ని ముక్కలు చేసి, పర్వత శిఖరాలపై రాబందులకు ఆహారంగా వదిలేస్తారు. టిబెటన్ బౌద్ధ సంప్రదాయం ప్రకారం, ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వేరే లోకానికి ప్రయాణిస్తుందని నమ్ముతారు. రాబందులు శవాన్ని పూర్తిగా తింటే, ఆ వ్యక్తి మంచి జీవితం గడిపాడని, అతని ఆత్మకు మోక్షం లభించిందని విశ్వసిస్తారు. టిబెట్ లో సమాధులు తవ్వడం, దహన సంస్కారాలు చేయడం కష్టమైన భౌగోళిక పరిస్థితుల వల్ల ఈ పద్ధతి పుట్టుకొచ్చిందని చెబుతున్నారు. ఈ ఆచారంలోకి బయటి వ్యక్తులను, పర్యాటకులను అనుమతించరు.